- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ యాప్ ద్వారా రోజుకు వెయ్యి సంపాదించొచ్చు..
భారత్ ఇంటెలిజెన్స్ (Bharat Intelligence) అనేది మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన ఓ అగ్రిటెక్ స్టార్టప్. కాగా ఇది ‘లేబర్ ఆపరేటింగ్ సిస్టమ్’ (Labour OS) అని పిలువబడే AI బేస్డ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది.

దిశ, ఫీచర్స్ : భారత్ ఇంటెలిజెన్స్ (Bharat Intelligence) అనేది మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన ఓ అగ్రిటెక్ స్టార్టప్. కాగా ఇది ‘లేబర్ ఆపరేటింగ్ సిస్టమ్’ (Labour OS) అని పిలువబడే AI బేస్డ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది. రైతులు, వ్యవసాయ కూలీల మధ్య మ్యాచింగ్ చేసి.. లేబర్ సమస్యలను పరిష్కరిస్తుంది. రోజూ పొందుతున్న కూలీ కంటే ఎక్కువ కూలీ సంపాదించేలా చేస్తుంది.
రైతులకు ప్రయోజనాలు
ఈ మధ్య వ్యవసాయ కూలీలు దొరకడమంటే గగనమైపోయింది. కారణం వ్యవసాయం చేసేవారి సంఖ్య తగ్గిపోవడం.. కూలీ ఎక్కువ అడగడం వంటి సమస్యలు ఉన్నాయి. ఈ ఆలోచనతోనే భారత్ ఇంటెలిజెన్స్.. రైతులకు కావాల్సిన నైపుణ్యం ఉన్న కూలీలను AI సాయంతో త్వరగా, నమ్మకంగా అందుబాటులోకి తెస్తుంది. వాట్సాప్ ద్వారా సులభంగా ఉపయోగించగలిగే ఈ యాప్ ద్వారా మధ్యవర్తులు, లేబర్ చౌక్‌ల వంటి గందరగోళం తగ్గుతుంది. పైగా పంట వేయడం నుంచి కోసే వరకు.. ముందస్తుగానే లేబర్ బుక్ చేసుకోవచ్చు. సీజన్‌కు ఎకరం చొప్పున కూలీలకు వేతనం చెల్లించేందుకు అగ్రిమెంట్ జరుగుతుండగా.. దీని కారణంగా పంటలు సకాలంలో పూర్తి కావడం.. దిగుబడి, ఆదాయం పెరుగుదల ఉంటుంది.
కూలీలకు బెనిఫిట్స్
కూలీలు ఈ యాప్ ద్వారా మంచి ప్రయోజనం పొందవచ్చు. నెల ఆదాయం ఆరు వేల రూపాయల నుంచి 20,000 వరకు పెరిగిందని యాప్ వినియోగించిన కూలీలు చెప్తున్నారు. కారణం సీజన్‌లో దాదాపు 300 రోజులు పనికి హామీ ముందుగానే ఉంటుంది. ఉత్పాదకత ఆధారంగా రోజుకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఆదాయం వస్తుంది. మహిళల ఆదాయం కూడా రెట్టింపు అవుతోంది. ఆటోమేటిక్‌గా సొసైటీలో గౌరవం, స్థిరత్వం, నైపుణ్యత గుర్తింపు వస్తుంది.
వ్యవస్థాపకులు ఎవరు?
వెంచర్ క్యాపిటల్ నేపథ్యం కలిగిన అజాన్ మర్చంట్, ఐఐటీ ఎంఐటీ(ఏఐ) బ్యాక్‌గ్రౌండ్ కలిగిన గౌరవ్ సంఘై కలిసి భారత్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్ రూపొందించారు. రైతులతో కలిసి జీవించి.. వారి సమస్యలు అర్థం చేసుకున్న ఇద్దరు.. ఈ ప్లాట్ ఫామ్‌తో సమస్యలను పరిష్కరించారు. ఇక ఇప్పటి వరకు ఐదు వేల ఎకరాలకు పైగా వ్యవసాయ పనులకు మూడు వేలకు పైగా కూలీలు ఉపయోగించబడ్డారు. రైతుల నుంచి 86శాతం రిపీట్ రేటు.. ఈ యాప్ సక్సెస్‌కు ఉదాహరణ.






