సింగపూర్‌లో మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల వేట.. కీలక కంపెనీల సీఈవోలతో వరుస భేటీలు

by Malleboina Mahesh |   (  Updated:2026-05-11 12:38:28  IST  )

మంత్రి నారా లోకేష్ సింగపూర్‌లో పర్యటిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులపై కీలక చర్చలు జరుపుతున్నారు. ఎంఐటీ కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ సమావేశంతో పాటు పలు కార్పొరేట్ సంస్థల సీఈవోలతో ఆయన భేటీ అవుతున్నారు.

సింగపూర్‌లో మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల వేట.. కీలక కంపెనీల సీఈవోలతో వరుస భేటీలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) నేడు సింగపూర్‌లో బిజీబిజీగా పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ విభాగాలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MTI) కార్యాలయంలో జరిగిన 'జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ' సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల కల్పన, పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల్లో సింగపూర్ భాగస్వామ్యంపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు.

అలాగే ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం కమోడిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ (CIC) సీఈవో, సీఎఫ్‌ఓలతో భేటీ కానున్న మంత్రి, సాంకేతిక రంగంలో ఏపీలో ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు. అనంతరం ప్రముఖ డిజైనింగ్ సంస్థ 'డీపీ ఆర్కిటెక్ట్స్' ప్రతినిధులతో సమావేశమై స్మార్ట్ సిటీ ప్లానింగ్, అమరావతి అభివృద్ధిపై చర్చించనున్నారు. ఏపీ నుంచి వెళ్లిన ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షిస్తూ, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పాలన, విద్యను రాష్ట్రానికి అందించడమే లక్ష్యంగా లోకేష్ ఈ పర్యటనను కొనసాగిస్తున్నారు.

గ్లోబల్ బిజినెస్ హబ్‌గా ఏపీ: సింగపూర్ నుంచి మంత్రి లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Next Story