- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్లోబల్ బిజినెస్ హబ్‌గా ఏపీ: సింగపూర్ నుంచి మంత్రి లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
సింగపూర్‌లో ప్రతిష్టాత్మక సన్‌టెక్ సిటీని మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీలో మైస్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రణాళికలను ఆయన వెల్లడించారు...

దిశ, వెబ్ డెస్క్: సింగపూర్‌లో ప్రతిష్టాత్మక సన్‌టెక్ సిటీని మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీలో మైస్ (MICE - Meetings, Incentives, Conferences, Exhibitions) రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రణాళికలను ఆయన వెల్లడించారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి నగరాల్లో ప్రత్యేక ఫెసిలిటేషన్ బ్యూరోలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తద్వారా అత్యాధునిక మైస్ ఎకో సిస్టమ్‌ను నిర్మించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా హోటల్ గదుల సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచి, మొత్తంగా 20,000 గదులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడతామని లోకేశ్ తెలిపారు.
ప్రపంచ స్థాయి మైస్ డెస్టినేషన్‌గా విశాఖ
రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇప్పటికే నాలుగు భారీ కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం లభించిందని లోకేశ్ తెలిపారు. అదేవిధంగా విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి మైస్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దేందుకు భారత ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా అంతర్జాతీయ స్థాయి వ్యాపార సదస్సులు, ప్రదర్శనలకు ఆంధ్రప్రదేశ్ వేదికగా మారనుందని మంత్రి లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పటికే..
విశాఖపట్నంలో ఇప్పటికే గూగుల్, టీసీఎస్ (TCS), కాగ్నిజెంట్ వంటి ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని లోకేశ్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇక్కడ ఏర్పాటు కాబోయే మౌలిక సదుపాయాలు కీలకమని మంత్రి చెప్పారు. గ్లోబల్ బిజినెస్, అంతర్జాతీయ ఎగ్జిబిషన్లు, భారీ ఈవెంట్లకు భారత్‌లోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.






