- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్- విజయవాడ హైవేను పూర్తి చేయండి : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి 8 లేన్ల విస్తరణ పనులు త్వరగా చేపట్టాలని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో : నిత్యం ప్రమాదాలతో డెత్ రోడ్ గా పిలువబడుతున్న హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి 8 లేన్ల విస్తరణ పనులు వీలైనంత త్వరగా చేపట్టాలని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్.హెచ్.ఎ.ఐ) ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇదే రహదారిలో ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ వరకు నాగపూర్ తరహాలో 7.1కి.మీ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, డీపీఆర్ మోర్త్ కు పంపిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్- విజయవాడ(ఎన్.హెచ్-65) విస్తరణ పనులు ప్రారంభంపై ప్రత్యేకంగా చర్చించారు. వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు.
హైదరాబాద్- విజయవాడ హైవేతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం కూడా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి అతి త్వరలో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్.హెచ్.ఎ.ఐ ఛైర్మన్ మంత్రికి వివరించారు. రాష్ట్రంలో ఎన్.హెచ్.ఎ.ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న, చేపట్టబోయే పలు ప్రాజెక్టుల అంశాలను మంత్రి ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వామ్యంగా నిలిచే ప్రాజెక్టులు త్వరగా పూర్తయేలా చూడాలని ఎన్.హెచ్.ఎ.ఐ ఛైర్మన్ ను మంత్రి కోరారు. మంత్రి వెంట రోడ్లు భవనాలు శాఖ స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, ప్రత్యేక కార్యదర్శి ప్రావిణ్య, ఎన్.హెచ్.ఎ.ఐ రీజినల్ ఆఫీసర్ శివ శంకర్, ఆర్ అండ్ బి సీఈలు ధర్మారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.






