- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎక్సైజ్ శాఖపై హరీష్ రావు ఆరోపణలు.. మంత్రి జూపల్లి కౌంటర్
హరీష్ రావు ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో నైనీ బొగ్గు స్కామ్, సోలార్ స్కామ్ తర్వాత ఎక్సైజ్ శాఖలో మరో స్కామ్ జరిగిందంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించడం సంచలనం రేపుతోంది. కాగా హరీష్ రావు ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. అసలు మైక్రో బ్రువరిస్ సిస్టమ్ తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. గతంలో అసలు లాటరీ విధానం లేకుండానే మైక్రో బ్రువరీస్ కు అనుమతులు మంజూరు చేసిన ఘనత గులాబీ పార్టీకే దక్కుంతుదని ఎద్దేవా చేసారు. 50 దరఖాస్తులు వస్తే కేవలం 20 మందికి మాత్రమే మొత్తం కట్టబెట్టారని.. అప్పుడు ఎందుకు నోరుమెదపలేదని హరీష్ రావును నిలదీశారు.
సింగూరు జలాల విషయంలో అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సింగూరు జలాలను మైక్రో బ్రేవరికి సరఫరా చేశారని.. అదేపని తాము ఇప్పుడు చేస్తే.. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పలు చేసే విధంగా మాట్లాడుతున్నారు ఆగ్రహం వ్యక్తం చేసారు. కాగా రాష్ట్రంలో మైక్రో బ్రువరీస్ కు లక్కీ డ్రా తీయకుండానే వాటి లెసెన్సులను మంత్రి ఆయన అనుచరునికి కేటాయించారని బుధవారం హరీష్ రావు ఆరోపించారు.






