- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
'Eట్లు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన మంత్రి హరీష్ రావు..
by Yarlagadda Naga Rani |

X
దిశ, సినిమా : అమీర్- ప్రణీత- దీపిక లీడ్ రోల్స్‌లో రాబోతున్న చిత్రం 'Eట్లు'. పందిళ్లపల్లి రోషి రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త నటీనటులతో రూపుదిద్దుకున్న 'Eట్లు' మూవీ తప్పకుండా విజయం సాధిస్తుందని, చిత్ర బృందానికి మంచి పేరు తెచ్చిపెడుతుందని అన్నారు. శ్రీజ ఆర్ట్స్, బాచిన వైష్ణవ్ చౌదరి ఫిల్మ్స్ సమర్పణలో బాచిన పూదారి రాజా గౌడ్, పూదరి రాజశేఖర్ గౌడ్ నిర్మిస్తున్న సినిమాలో మహాలక్ష్మి, జి.వి నారాయణ రావు, జబర్దస్త్ యాక్టర్స్ జీవన్, రాజమౌళి, కొమురం, బాబి ,శిరీష, సుమన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి శివ-ప్రణయ్ సంగీతం అందిస్తున్నారు.
Next Story