శ్రీశైలంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు

by Jakkula.Mamatha |

శ్రీశైల మహాక్షేత్రంలో మంగళవారం ఉదయం భక్తి శ్రద్ధల నడుమ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీశైలంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు
X

దిశ, అచ్చంపేట: అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైల మహాక్షేత్రంలో మంగళవారం ఉదయం భక్తి శ్రద్ధల నడుమ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి, ఎమ్మెల్యేలకు శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈవో) ఎం.శ్రీనివాసరావు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు మంత్రి, ఎమ్మెల్యేలకు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి, శేషవస్త్రాలతో ఘనంగా సత్కరించారు.

Next Story