ఫేస్‌బుక్‌లో ప్రధాని మోడీ వీడియో బ్లాక్.. స్పందించిన మెటా

by Malleboina Mahesh |   (  Updated:2026-07-28 05:32:37  IST  )

ఫేస్‌బుక్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ వీడియో బ్లాక్ అవ్వడం, అందుబాటులో లేకుండా పోవడం సంచలనం సృష్టించగా మెటా స్పందించింది.

ఫేస్‌బుక్‌లో ప్రధాని మోడీ వీడియో బ్లాక్.. స్పందించిన మెటా
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ (Facebook)లో భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)కి సంబంధించిన ఒక వీడియో బ్లాక్ అవ్వడం, అందుబాటులో లేకుండా పోవడం సంచలనం సృష్టించింది. దీనిపై నెటిజన్లు, అధికార పక్ష నేతల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఫేస్‌బుక్ మాతృ సంస్థ 'మెటా' (Meta) త్వరితగతిన స్పందించింది. ప్రధాని వీడియోను బ్లాక్ చేయడం పొరపాటున జరిగిందని, ఆ లోపాన్ని సరిదిద్ది వీడియోను తిరిగి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పునరుద్ధరించామని మెటా అధికారిక ప్రతినిధి ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

ఈ ఘటన సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేక అల్గారిథం తప్పుగా ప్రతిస్పందించడం వల్ల జరిగిందా అనే అంశంపై నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించారు. విమర్శల నడుమ మెటా యాజమాన్యం త్వరితగతిన చర్యలు తీసుకుని ఆ వీడియో అందరికీ కనిపించేలా రీ-స్టోర్ చేసింది. తమ ప్లాట్‌ఫామ్‌లలో పొరపాటున జరిగిన ఈ అంతరాయానికి స్పష్టతనిస్తూ, విషయాన్ని సమర్థించుకుంటూ మెటా ప్రతినిధి వివరణ ఇచ్చారు.

Next Story