- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్, కేటీఆర్ లకు ప్రజల సమస్యలు పట్టవు : మంత్రి అడ్లూరి
బీఆర్ఎస్ హాయంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో కోట్ల రూపాయల కమీషన్లు తీసుకున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో కోట్ల రూపాయలు కమీషన్లు తీసుకొని రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధను చిన్నాభిన్నం చేశారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. గురువారం గాంధీ భవన్ లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మీడియా కమిటి చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డిలతో కలిసి మంత్రి లక్ష్మణ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అప్పులకు, చేసిన పనికి రూ. 47వేల కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సి వచ్చిందని విమర్శించారు. కాళేశ్వరంలో చేసిన అవినీతికి ఇతర దేశాల్లో అయితే కఠిన శిక్షలు విధించే వారని, కాళేశ్వరంపైన కేసీఆర్, కేటీఆర్ లు సమాధానం చెప్పాలని లక్ష్మణ్‌కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం ఉన్నా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, బీఆర్ఎస్ నేతలు సీఎంతో పాటు ప్రభుత్వంపై బురద జల్లె ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఏనాడు ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల సంక్షేమాన్ని కేసీఆర్ పట్టించుకోలేదని, ముఖ్యమైన అంశాలపై మాట్లాడానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఏనాడు అసెంబ్లీకి రాలేదని మంత్రి అడ్లూరి ధ్వజమెత్తారు. ప్రజాపాలనలో ప్రజలు తమ వెంట ఉన్నారని, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయాలని సీఎంపైన ఏక వచనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాష్ర్ట ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టె ప్రయత్నంలో భాగంగా కాళేశ్వరం వడ్డీలను తగ్గించడానికి సీఎం చొరవ తీసుకున్నారని, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటిల్లో నాలుగు అమలు అవుతున్నాయని, మరో రెండు అమలు చేస్తామని మంత్రి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు






