మెదక్‌లో మిలిటరీ ఉద్యోగి దారుణ హత్య.. భార్య కుటుంబం పై అనుమానాలు !

by Batti.Sumithra |

మిలిటరీ ఉద్యోగి పుంటి కూర కుమార్ గౌడ్ (45) హత్యకు గురైన సంఘటన మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది.

మెదక్‌లో మిలిటరీ ఉద్యోగి దారుణ హత్య.. భార్య కుటుంబం పై అనుమానాలు !
X

దిశ, మెదక్ టౌన్ : మిలిటరీ ఉద్యోగి పుంటి కూర కుమార్ గౌడ్ (45) హత్యకు గురైన సంఘటన మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లే మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామానికి చెందిన పుంటి కూర కుమార్ గౌడ్ కుటుంబంతో కలిసి మిలిటరీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య పద్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ మేరకు పుంటికూర కుమార్ గౌడ్ తన భార్యతో తరచూ తగాదాల కారణంగా మరో మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే ఆరోపణతో భార్య పద్మ, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, మరి కొందరితో కలిసి హత్య చేశారని సమాచారం. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

Next Story