అర్ధరాత్రి దొంగల బీభత్సం.. వరుసగా నాలుగు ఇళ్లలో చోరీకి యత్నం

by Jakkula.Mamatha |

అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా నాలుగు ఇళ్లలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

అర్ధరాత్రి దొంగల బీభత్సం.. వరుసగా నాలుగు ఇళ్లలో చోరీకి యత్నం
X

దిశ, మిడ్జిల్: అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా నాలుగు ఇళ్లలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అయ్యవారిపల్లి గ్రామంలో తాళాలు వేసిన ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. సుధాకర్ రెడ్డి ఇంట్లో రూ.20వేల నగదు, టీవీ, సుజాత ఇంట్లో రూ.15 వేలు నగదు చోరీకి పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున ఇంటికి వచ్చిన బాధితులు ఇంటి తాళాలు విరగొట్టి బీరువా తెరిచి ఉండడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చోరీకి పాల్పడిన ఇండ్లను పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

Next Story