- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SIRలో ఓటర్ల సమస్యలు పరిష్కరించాంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వినతిపత్రం
ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో లక్షలాది మంది ప్రజలు కీలకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించాలని కోరుతూ టీపీసీసీ ఈసీ కోఆర్డినేషన్ కమిటీ బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో లక్షలాది మంది ప్రజలు కీలకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించాలని కోరుతూ టీపీసీసీ ఈసీ కోఆర్డినేషన్ కమిటీ బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించింది. ఈ మేరకు కమిటీ చైర్మన్, పులిపాటి రాజేష్ కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ 2002 డేటాబేస్ అనుగుణంగా సంబంధిత వివరాలను నమోదు చేసిన ఓటర్లకు నోటీసులు జారీపైన ఈర్వోలు, బీఎల్ఓలకు ఆదేశాలు ఇవ్వాలని కోరామన్నారు. ఆన్ లైన్ లో గణన ఫారాలు సమర్పించిన వారు భౌతికంగా కూడా ఫారాలు సమర్పించే అంశంపైన స్పష్టత ఇవ్వాలని కోరినట్లుగా రాజేష్ కుమార్ తెలిపారు.
2025 తుది ఓటర్ల జాబితాల ప్రచురణ దర్వాత దానికి అదనంగా 4 అనుబంధ ఓటర్ల జాబితాలు రూపొందించారని, దీనిలో చాలా మందికి గణన పత్రాలు ఇవ్వలేదని కొత్త ఓటర్లకు గణన పత్రాలు ఇవ్వాలని కోరినట్లుగా ఆయన చెప్పారు. గణన పత్రాలపైన తాజా ఫోటోలు అతికించడంపైన స్పష్టత కావాలని, ఫోటో ఇవ్వాలా లేక బీఎల్ఓ వారి ఫోన్ల ద్వారా బీఎల్ఓ యాప్ లో లైవ్ ఫోటో తీసుకునే అంశంపైన స్పష్టత ఇవ్వాలని కోరినట్లుగా రాజేష్ కుమార్ తెలిపారు. ఓటర్లు గణన పత్రాలను నింపడంలో సహాయం చేసేందుకు బీఎల్ఓలకు సహాయకుడిని, సూపర్ వైజర్లకు ఒక కంప్యూటర్ ఆపరేటర్ ని నియమించాలని సీఈసీకి విజ్ఞప్తి చేసినట్లుగా రాజేష్ కుమార్ చెప్పారు.
2002 సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీలో 353 పోలింగ్ బూత్ లు ఉన్నాయని, కానీ, 2009లో డిలిమిటేషన్ తర్వాత 348 ఉంచి 353 వరకు ఉన్న పోలింగ్ బూత్ లను ఇతర నియోజకవర్గాలకు తరలించారని, దీనిత వల్ల 2002 వివరాలు లభ్యం కావడం లేదన్నారు. దీనితో 5వేల మంది ఓటర్లకు 2002 ఓటరు వివరాలను కనుక్కోలేకపోతున్నందున ప్రత్యేక కేసుగా పరిగణించి చివరి ఎస్ఐఆర్ తో వారిని నమోదు చేయకుండా మినహాయించి, ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా తుది ఓటర్ల జాబితాలో చేర్చాలని సీఈసీకి విజ్ఞప్తి చేశామని రాజేష్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐఆర్ స్టేట్ కోఆర్డినేటర్ గంపా వేణుగోపాల్, కో ఆర్డినేషన్ సభ్యులు మహమ్మద్ వాజీద్ హుస్సేన్, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఖాళీద్ సైఫుల్లాహ్ పాల్గొన్నారు.






