- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి అమావాస్య పూజలు కలకలం.. ఇంటి ముందు నిమ్మకాయలు, కుంకుమ!
నార్సింగి సర్కిల్ పరిధిలోని మణికొండ శివాజీ నగర్‌లో అమావాస్య సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు వివాదానికి దారితీశాయి.

దిశ, గండిపేట: నార్సింగి సర్కిల్ పరిధిలోని మణికొండ శివాజీ నగర్‌లో అమావాస్య సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు వివాదానికి దారితీశాయి. ఓ మహిళ తన ఇంటి ముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు ఉంచి పూజలు చేయడంపై కొందరు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్యల వల్ల కాలనీవాసుల్లో భయాందోళనలు నెలకొంటున్నాయని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంబంధిత కుటుంబాన్ని ప్రశ్నించగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఓ మహిళ ఎదురింటి వారి కళ్లలో కారం చల్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రాయదుర్గం పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఘటనతో శివాజీ నగర్ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టారు.






