- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నిధులు వస్తున్నా నిర్లక్ష్యం ఎందుకు?’.. పాఠశాల పారిశుద్ధ్య పనుల పై కలెక్టర్ ఆగ్రహం
విద్యా సంవత్సరం తొలి రోజే తలెత్తిన నీటి సమస్యలు, అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్ల కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పై సోమవారం ‘దిశ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. స్పందించారు.

దిశ, కారేపల్లి: కారేపల్లి మండలం విశ్వనాథపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో విద్యా సంవత్సరం తొలి రోజే తలెత్తిన నీటి సమస్యలు, అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్ల కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పై సోమవారం ‘దిశ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. స్పందించారు. మంగళవారం ఆయన పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ శాఖల ద్వారా నిధులు విడుదలవుతున్నప్పటికీ, పనుల అమలులో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండల స్థాయి అధికారులను ప్రశ్నించారు.
అలాగే పాఠశాల నిర్వహణ, పారిశుద్ధ్య పరిరక్షణ విషయంలో ఉపాధ్యాయుల పనితీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చే పరిస్థితి లేకుండా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి నిర్లక్ష్యంపై ఎలాంటి రాజీ ఉండదని అధికారులను హెచ్చరించారు. కలెక్టర్ పర్యటన సమాచారం అందుకున్న వెంటనే ఉపాధ్యాయులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాఠశాలకు చేరుకుని పారిశుద్ధ్య పనులను చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. కలెక్టర్ తనిఖీ అనంతరం మాత్రమే అధికారులు స్పందించే పరిస్థితి నెలకొనడం పట్ల గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ పై నిరంతర పర్యవేక్షణ అవసరమని ఇన్చార్జి ఎంపీడీవోకు రవీంద్ర ప్రసాద్ కు తెలిపారు.






