‘కల్కి-2’ సినిమాలో ఆలియా భట్.. ఏ పాత్రలో నటించనుందంటే?

by Mallepaka Hamsa |

గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా రెండవ షెడ్యూల్‌లో అలియా భట్ స్వయంగా పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి.

‘కల్కి-2’ సినిమాలో ఆలియా భట్.. ఏ పాత్రలో నటించనుందంటే?
X

దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ‘కల్కి-2’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ‘కల్కి’కి సీక్వెల్‌గా రాబోతుండటంతో డార్లింగ్ అభిమానులతో పాటు, సినీ సెలబ్రిటీల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. గత కొద్దికాలంగా ‘కల్కి-2’ మూవీకి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. కల్కి 2’లో అలియా భట్ నటించడం దాదాపు ఖాయమైందని టాక్.

గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా రెండవ షెడ్యూల్‌లో అలియా భట్ స్వయంగా పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. అక్కడ ఆమెపై దాదాపు ఐదు రోజుల పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రబృందం సైలెంట్‌గా చిత్రీకరించిందని టాక్. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా, కథను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే విధంగా ఉండబోతోందని తెలుస్తోంది.. అయితే, మొదట్లో ఈ చిత్రంలో దీపికా పదుకోణె స్థానంలో సుమతి పాత్ర కోసం ఆలియా భట్‌ను అనుకుంటున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. తాజా లీకుల ప్రకారం ఆమె సుమతి పాత్ర చేయడం లేదని తెలుస్తోంది. ఆలియా భట్ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ అత్యంత కీలకమైన ఒక ప్రత్యేక పాత్రను డిజైన్ చేశారట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై అధికారిక విడుదల కావాల్సి ఉంది.

Next Story