- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సింగరేణి మీ ఆడబిడ్డగా అడుగుతున్నా’.. శ్రీరాంపూర్ మైన్ సందర్శనలో కవిత భావోద్వేగ పిలుపు!
సింగరేణి మీ ఆడబిడ్డగా కార్మిక సంఘాల సంక్షేమం కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీతో మీ ముందుకు వచ్చిన నన్ను ఆశీర్వదించండి అంటూ టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు.

దిశ, మంచిర్యాల: సింగరేణి మీ ఆడబిడ్డగా కార్మిక సంఘాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ పార్టీతో మీ ముందుకు వచ్చిన నన్ను ఆశీర్వదించండి అంటూ తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి Rk 7 మైన్ ను సందర్శించారు. మైన్ వద్ద పెద్ద ఎత్తున కవితకు సింగరేణి కార్మికులు ఆహ్వానం పలికారు. కార్మిక మహిళా సూపర్వైజర్లతో, అధికారులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో మాట్లాడుతూ.. ఆనాడు సింగరేణిలో మహిళలు ఉండాలని మేము పార్లమెంట్‌లో ఫైట్ చేశామన్నారు. ఈరోజు సింగరేణిలో మహిళా ఉద్యోగులను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. అయితే ఇక్కడ ఉన్న మహిళా ఉద్యోగులకు సరైన సౌకర్యాలు లేవన్నారు.
సింగరేణి చరిత్రలో ఇప్పుడిప్పుడే మహిళా ఉద్యోగులు వస్తున్నారని, వారికి సరైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మేము మైన్స్ దగ్గరకు వెళ్తే నిన్న ఈరోజు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మైండ్ మీద మీటింగ్లు పెట్టలేదా అని ప్రశ్నించారు.? మీ రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ మీటింగ్ లో పెట్టలేదా అని దుయ్యబట్టారు. కార్మికుల బాధలను తెలుసుకుని పోరాటం చేస్తేనే కదా చట్టాలు వచ్చేది అన్నారు. తల్లి కాంగ్రెస్‌తో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం.. ఇప్పుడు పిల్ల కాంగ్రెస్‌తో కొట్లాడాలేమా అన్నారు. తెలంగాణ రక్షక సేన పార్టీ ఐదు అంశాల ఎజెండాతో ముందుకు వచ్చిందన్నారు.
ఉచిత విద్య, వైద్యం ప్రధాన ఎజెండా అని తెలిపారు. ఇంకా పిల్లలను మంచి స్కూల్లో చదివించే పరిస్థితి ఎక్కడ ఉంటుందన్నారు. పిల్లల కోసం మంచి స్కూల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆఫీసర్లకు కాంట్రాక్టర్లకు కావలసిన అవసరాలు తీర్చేందుకు డబ్బు ఉంటుంది కానీ కార్మికుల కోసం ఉండదన్నారు. గతంలో అన్నలు ఉండడంతో కార్మికుల విషయంలో ఆఫీసర్లు కొంత పద్ధతిగా వ్యవహరించే వారని, ఇప్పుడు అన్నలు పోయారని మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. కార్మికులను వేధించే అధికారులపై కేసులు పెట్టాలన్నారు.
సింగరేణిలో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లను కూడా అన్ఫిట్ చేయడం లేదన్నారు. గత రెండు రోజుల క్రితం జిల్లాకు వచ్చిన డిప్యూటీ సీఎం 350 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు కానీ 200 మంది ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారని అన్నారు. మైన్ మీటింగులు పెట్టుకోవడం కార్మికుల హక్కు అన్నారు దాన్ని అడ్డుకుంటామంటే ఊరుకునేది లేదన్నారు. సింగరేణిలో హెచ్ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్ అవినీతి లేని కార్మికుల కోసం పోరాటం చేసే నాయకుడు అని అన్నారు. సింగరేణిలో హెచ్ఎంఎస్ తో కలిసి తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. టిఆర్ఎస్‌ను హెచ్ఎంఎస్ ను ఆశీర్వదించాలని కోరారు. కార్మికుల సంక్షేమం కోసం పోరాడాల్సింది పోయి మమ్మల్ని అడుగు అడుగున అడ్డుకోవడం మానుకోవాలని అన్నారు.






