- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నీట్’ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం
నీట్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం! హాల్ టికెట్ ఉంటే చాలు..

దిశ, వెబ్ డెస్క్: వైద్య విద్యే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న ‘నీట్’ (NEET UG 2026) అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) అద్భుతమైన తీపి కబురు అందించింది. జూన్ 21న జరగబోయే నీట్ రీ ఎగ్జామ్ కు (Re-examination) హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులు తమ వెంట కేవలం ‘నీట్ హాల్ టికెట్’ చూపిస్తే చాలు.. ఎలాంటి చార్జీలు లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని (Free travel) స్పష్టం చేసింది.
అలాగే ఎగ్జామ్ రోజు విద్యార్థులు ఎక్కడా ఇబ్బంది పడకుండా, సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ (RTC) ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో సాధారణ బస్సులతో పాటు అదనంగా ప్రత్యేక బస్సులను కూడా నడపనుంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారి విజయయాత్రకు తోడుగా నిలిచేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే నీట్ రీ ఎగ్జామ్ (NEET Re-Exam) సందర్భంగా టెలిగ్రామ్ పై కేంద్ర తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే.






