కామారెడ్డిలోని పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డు.. నిరాశతో వెనుదిరిగిన వాహనదారులు

by Jakkula.Mamatha |

కామారెడ్డి పట్టణంలోని వివిధ పెట్రోల్ బంకుల వద్ద సోమవారం సాయంత్రం నుంచి ‘నో స్టాక్’ బోర్డు దర్శనమివ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కామారెడ్డిలోని పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డు.. నిరాశతో వెనుదిరిగిన వాహనదారులు
X

దిశ, కామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణంలోని వివిధ పెట్రోల్ బంకుల వద్ద సోమవారం సాయంత్రం నుంచి ‘నో స్టాక్’ బోర్డు దర్శనమివ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు అయిపోవడంతో బంక్ యాజమాన్యం సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు.

నిరాశతో వెనుదిరిగిన వాహనదారులు

‘నో స్టాక్’ బోర్డు చూసి కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఇంధనం నింపుకోవడానికి వచ్చిన వాహనదారులు నిరాశతో వెనుదిరిగారు. ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర బంకుల వద్ద రద్దీ

పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్న బంకుల వద్ద మాత్రం వాహనాలతో రద్దీ పెరిగింది. దూర ప్రయాణం ఉంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్లి కొట్టించుకోవాలో అర్థం కావడం లేదు అని ఓ ద్విచక్ర వాహనదారుడు పేర్కొన్నాడు. సరఫరా ట్యాంకర్లు ఎప్పుడు వస్తాయో తెలియక వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే పెట్రోల్, డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.

కృత్రిమ కొరతనా.. సరఫరా లేకనేనా..!

కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల వాళ్ళు పెట్రోల్ బంకుల్లో సోమవారం సాయంత్రం నుంచి నో స్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. దీంతో పెట్రోల్ డీజిల్ కోసం వచ్చిన వాహనదారులు నో స్టాక్ బోర్డులను చూసి అసహనం వ్యక్తం చేస్తూ ఇబ్బందుల మధ్య వెనుదిరిగి వెళ్లిపోయారు. ఏది ఏమైనప్పటికీ సంబంధిత అధికారులు ఈ నో స్టాక్ బోర్డుల విషయమై విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించారని తేలితే సంబంధిత నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Next Story