కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్ పై తాత్కాలిక నిషేధం

by Malleboina Mahesh |   (  Updated:2026-06-16 05:24:11  IST  )

నీట్ ఈ ఎగ్జామ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్ పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్ పై తాత్కాలిక నిషేధం
X

దిశ, వెబ్ డెస్క్: నీట్ రీ ఎగ్జామ్ (NEET Re-Exam) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ (Telegram) యాప్ పై తాత్కాలిక నిషేధం (Temporary ban) విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం జూన్ 22 వరకు వరకు కొనసాగుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొన్ని సైబర్ నేరగాళ్ల ముఠాలు, అనామక టెలిగ్రామ్ ఛానెళ్లు అభ్యర్థుల నుంచి ప్రశ్నపత్రాల లీకేజీ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించడంతో ఐటీ చట్టం సెక్షన్ 69A కింద ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టింది. ఈ తాత్కాలిక నిషేధ నిర్ణయాన్ని జాతీయ పరీక్షల సంస్థ (NTA) పూర్తిగా స్వాగతించింది.

ఈ మోసాలతో పాటు, పరీక్ష ముగిసిన తర్వాత ప్రశ్నపత్రాన్ని అప్‌లోడ్ చేసి, మెసేజ్‌ను ఎడిట్ చేయడం ద్వారా పరీక్షకు ముందే పేపర్ లీక్ అయినట్లు తప్పుడు స్క్రీన్‌షాట్లు సృష్టించి పుకార్లు పుట్టిస్తున్నట్లు అధికారులు గమనించారు. ఈ 'మెసేజ్ ఎడిటింగ్' ఫీచర్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి, జూన్ 30 వరకు భారతదేశంలో ఈ ఫీచర్‌ను కూడా నిలిపివేయాలని కేంద్రం టెలిగ్రామ్ సంస్థను ఆదేశించినట్లు తెలుస్తుంది. సాధారణ వినియోగదారులకు కొంత ఇబ్బంది కలిగినప్పటికీ, పరీక్షల పారదర్శకతను కాపాడటానికి, అభ్యర్థులు తప్పుడు పుకార్ల బారిన పడకుండా ఉండటానికి ఈ నిర్ణయం అనివార్యమైందని స్పష్టం చేశారు.

Next Story