- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఆఫ్టర్ షాక్స్‌తో వణికిన ప్రజలు
ఇండోనేషియాను మరోసారి భారీ భూకంపం వణికించింది. మంగళవారం ఉదయం వచ్చిన భూ ప్రకంపనల ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇండోనేషియాను మరోసారి భారీ భూకంపం వణికించింది. మంగళవారం ఉదయం వచ్చిన భూ ప్రకంపనల ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. భూకంపం తర్వాత వరుసగా వచ్చిన భూ ప్రకంపనలు (After Shocks)తో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒక నిమిషానికి పైగా భూమి తీవ్రంగా కంపించగా.. కొన్ని ప్రాంతాల్లో భవనాలు కూలినట్లు సమాచారం. ఇళ్లలో సామాన్లు కింద పడి గోడలు బీటలు వారాయి. ఈ ప్రకృత్తి విపత్తు కారణం సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించిన వివరాల ప్రకారం.. సెంట్రల్ సులవేసి ప్రాంత రాజధాని 'పాలు' నగరానికి తూర్పు-ఆగ్నేయంగా 46 కిలోమీటర్ల (29 మైళ్లు) దూరంలో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. భూగర్భంలో కేవలం 10 కిలోమీటర్ల (6 మైళ్లు) లోతులో ఈ ప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రధాన భూకంపం సంభవించిన కొద్దిసేపటికే రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో మరొక శక్తివంతమైన భూకంపం కూడా సంభవించింది. ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.
భౌగోళికంగా ఇండోనేషియా దేశం పలు భూకంప ఫౌల్ట్స్(సరిహద్దు రేఖలు) పై విస్తరించి ఉండటం వల్ల ఇక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తూనే ఉంటాయి. గతంలో జనవరి 2021లో కూడా సులవేసి ద్వీపంలోని మాముజు నగర సమీపంలో సంభవించిన 6.2 తీవ్రత కలిగిన ఘోర భూకంపం కారణంగా దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో వరుస భూప్రకంపనల భయంతో వేలాది మంది ప్రజలు రోజుల తరబడి ఇళ్ల నుంచి బయటకు వచ్చి బహిరంగ ప్రదేశాల్లోనే గడిపారు.






