- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనసేనలోకి భారీ చేరికలకు పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్
జనసేనలో చేరికల కోసం 14 మందితో ‘జాయినింగ్స్ కమిటీ’ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్. త్వరలోనే తెలంగాణ కమిటీ ప్రకటన!

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ (Janasena party) సరికొత్త వ్యూహంతో ముందుకు వెళుతోంది. విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించే ప్రక్రియను మరింత వ్యవస్థీకృతంగా మార్చేందుకు వీలుగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో చేరికల సమన్వయం కోసం 14 మంది సభ్యులతో కూడిన ‘జాయినింగ్స్ కమిటీ’ (‘Joinings Committee’)ని ప్రకటిస్తూ ఆయన ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రతిష్టాత్మక కమిటీలో జనసేన పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలకు చోటు దక్కింది.
ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీలతో పాటు ఎంపీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు పార్టీ సీనియర్ నేతలు కొటికలపూడి చినబాబు, డా.హరిప్రసాద్, డా.పెదపూడి విజయ్ కుమార్, కొరికాన రవికుమార్, వంపూరు గంగులయ్య, టి.సి. వరుణ్, ఆరణి మదన్ లను సభ్యులుగా నియమించారు. ప్రస్తుతం ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే చేరికలను పర్యవేక్షిస్తుందని.. తన ఢిల్లీ పర్యటన ముగిసిన అనంతరం కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, చేరికల విధివిధానాలపై దిశానిర్దేశం చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అలాగే, ఏపీ తరహాలోనే త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేక జాయినింగ్స్ కమిటీని నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జనసేనాని వెల్లడించారు.






