రెమ్యునరేషన్ ఎంత ఇచ్చినా సరే ఇకపై అలాంటి పాత్రలు చేయాలనుకోవడం లేదు.. స్వాసిక షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

కేవలం స్క్రీన్ మీద కనిపించడం కోసం అలాంటి ప్రాధాన్యత లేని రొటీన్ పాత్రలు చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు.

రెమ్యునరేషన్ ఎంత ఇచ్చినా సరే ఇకపై అలాంటి పాత్రలు చేయాలనుకోవడం లేదు.. స్వాసిక షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ స్వాసిక హీరోయిన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను మెప్పిస్తూ వరుస హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇటీవల ‘కరుప్పు’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న స్వాసిక త్వరలో ‘వందదేవుళ్లు’తో ప్రేక్షకులను అలరించనున్నారు. తమిళంలో ‘నూరుసామి’ పేరుతో రాబోతుంది. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ‘బిచ్చగాడు’ఫేమ్ శశి తెరకెక్కించారు. విజయ్, శశి కాంబోలో రాబోతున్న సెకండ్ ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 19న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో.. ప్రమోషన్స్‌లో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ‘నూరుసామి’ సినిమాలో ఒక తల్లి పాత్రలో నటించాను. అది చూసినప్పటి నుండి తెలుగు చిత్ర పరిశ్రమ నుండి నాకు వరుసగా తల్లి పాత్రల ఆఫర్లు రావడం మొదలయ్యాయి. కానీ తెలుగులో నాకు వచ్చే ఆఫర్లన్నీ ఎలా ఉన్నాయంటే.. కేవలం హీరోకో, హీరోయిన్ కో కాఫీ ఇవ్వడం, టీ అందించడం లేదా రండి.. అన్నం తినండి అని ఒకట్రెండు డైలాగులు చెప్పి వెళ్ళిపోయే పాత్రలే.

కేవలం స్క్రీన్ మీద కనిపించడం కోసం అలాంటి ప్రాధాన్యత లేని రొటీన్ పాత్రలు చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అసలు అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి నాకు ఇంకా వయసు సరిపోదు, ఆ ఏజ్ గ్రూప్ నాది కాదని నేను ముందే చెబుతున్నాను. నేను ‘నూరుసామి’ సినిమాలో కూడా తల్లి పాత్రలోనే నటించాను, కానీ ఇందులో నా క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా, కథతో పాటు సాగుతూ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందుకే ఆ పాత్రను ఒప్పుకున్నాను. అంతేకాని, కేవలం ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చి, సీన్లలో వెనుక నిలబెట్టే పాత్రలను నేను అస్సలు ప్రోత్సహించను. ఇకపై నాకు ఎంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ.. ప్రాధాన్యత లేని అలాంటి రొటీన్ తల్లి పాత్రలకు మాత్రం నేను ముఖం మీదే నో చెప్పేస్తాను. నా పాత్రకు కథలో బలమైన ఇంపార్టెన్స్ ఉంటేనే నటిస్తాను’’ అని చెప్పుకొచ్చింది. ఎలాంటి మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు స్వాసిక చెప్పడంతో ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story