- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్యూచర్ సిటీ జోలికి వస్తే ఊరుకునేది లేదు : మెట్టు సాయి కుమార్
మాజీ మంత్రి హరీష్ రావు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ చేస్తున్న దగాకోరు మాటలను మానుకోవాలని రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హితవు పలికారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిన తర్వాత ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాల్ రావులా తయారయ్యారని, బీఆర్ఎస్ ఆత్మను ఎక్కించుకుని అబద్దాలు ఆడుతున్నారని శాసన మండలిలో ప్రభుత్వ విప్, అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవన్ రెడ్డి పనికిమాలిన, నీతిమాలిన మాటలు మాట్లాడొద్దని, గుడ్డిగా విమర్శలు చేయకూడదని అద్దంకి దయాకర్ హితవు పలికారు. రేవంత్ రెడ్డిని విమర్శించడానికే కేసీఆర్ జీవన్ రెడ్డిని తీసుకున్నాడా? లేకపోతే పదవులు ఇస్తాడా...? బీఆర్ఎస్ హయాంలో కళ్లాల్లో తడిసి మొలకలెత్తిన ధాన్యాన్ని చూడలేదా? అని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుపుత్రుడని, మంత్రి తుమ్ముల నాగేశ్వరరావు రైతుల కోసం ఎంత శ్రమ చేస్తున్నా డో అందరికి తెలుసని అద్దంకి దయాకర్ చెప్పారు. రైతులను మోసం చేసే ప్రకటన చేయకూడదని ఆయన సూచించారు. డిప్యూటీ సీఎం, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లపైన జూమ్ మీటింగ్ జరిగిందని, 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయబోతున్నామని అద్దంకి దయాకర్ చెప్పారు. ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల పైగా ఇప్పటికే కొనుగోలు చేశామని, హమాలీలు, లారీల కొరతను అధిగమించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, తరుగు తీస్తే చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూ. 7840 కోట్లను ఇప్పటికే రైతులకు చెల్లించామని, రూ. 45 వేల కోట్లను కేవలం ధాన్యం రైతులకే చెల్లించామని అద్దంకి దయాకర్ వెల్లడించారు. రాష్ట్రం కొన్న ధాన్యాన్ని కేంద్రం తీసుకోవడం లేదని, బీఆర్ఎస్ పార్టీ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించదని ఆయన నిలదీశారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా రికార్డు స్థాయిలో పండిన పంట బీఆర్ఎస్ కళ్లకు కనిపించడం లేదని,
ఫ్యూచర్ సిటీపై హరీష్ రావు దగాకోరు మాటలు : మెట్టు సాయి కుమార్
మాజీ మంత్రి హరీష్ రావు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ చేస్తున్న దగాకోరు మాటలను మానుకోవాలని రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హితవు పలికారు. ఆదివారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీని ఆపే దమ్ము, సత్తా మీకు, మీ మామకు, మీ బామ్మ్మర్దికి లేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో మీ పార్టీ వచ్చేది లేదని, హరీష్ రావు వచ్చే ఎన్నికల్లో ఓడిపోయేది ఖాయం, మీ పార్టీని ప్రజలు ఎన్నికల్లో బొందపెట్టేది ఖాయమని మెట్టు సాయి కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీ అంటే తెలంగాణ యువత భవిష్యత్తు అని, ఫ్యూచర్ సిటీ ని అడ్డుకుని తెలంగాణ యువత భవిష్యత్తుకు అడ్డుపడాలని హరీష్ రావు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ యువతను పట్టించుకునే పాపాన పోలేదని, రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీని తెలంగాణ అభివృద్దికి కోసం నిర్మిస్తున్నారని, రేవంత్ రెడ్డికి తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, నిరుద్యోగుల ఆశీర్వాదం ఉందని మెట్టు సాయి కుమార్ తెలిపారు.






