మెటా షాక్.. నేడు 8 వేల మంది ఉద్యోగులపై లేఅఫ్ వేటు!

by Muthe.Rajitha |

ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా ప్లాట్‌ఫామ్స్ (Meta Platforms) ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది.

మెటా షాక్.. నేడు 8 వేల మంది ఉద్యోగులపై లేఅఫ్ వేటు!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా ప్లాట్‌ఫామ్స్ (Meta Platforms) ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. సంస్థలో పని చేస్తున్న మొత్తం సిబ్బందిలో ఏకంగా 10 శాతం మందిని తొలగించే భారీ లేఅఫ్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. దీనివల్ల దాదాపు 8,000 మంది ఉద్యోగులు ఒకేసారి తమ ఉద్యోగాలను కోల్పోవలసి వస్తోంది. ఉద్యోగుల తొలగింపుతో పాటు, కంపెనీలో ఖాళీగా ఉన్న మరో 6,000 ఓపెన్ పొజిషన్లను కూడా మెటా పూర్తిగా రద్దు చేసింది. ఈ భారీ లేఅఫ్ ప్రక్రియ నేటి నుండి అమలులోకి రానుండగా.. వారంతా ఉద్యోగాలు కోల్పోనున్నారు.

తొలగింపునకు ప్రధాన కారణాలు

మెటా సంస్థ ప్రస్తుతం సాంకేతిక విప్లవంగా మారిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంపై దృష్టి సారించింది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ 2026 లో కేవలం AI పరిశోధనలు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM), మౌలిక వసతుల కల్పన కోసం సుమారు 135 బిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌ను కేటాయించారు. ఒకవైపు ఏఐ సాంకేతికతపై అసాధారణంగా పెట్టుబడులు పెంచుకుంటూ పోతుండటంతో, అంతర్గత బడ్జెట్‌ను, కంపెనీ నిర్వహణా ఖర్చులను (Operational Costs) తగ్గించుకోవడానికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోక తప్పలేదని సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా మెటా చరిత్రలోనే ఇది అతిపెద్ద లేఅఫ్ రౌండ్లలో ఒకటిగా నిలిచింది. గ్లోబల్ టెక్ మార్కెట్‌లో మెటా తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.

Next Story