- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల
ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖాళీల భర్తీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖాళీల భర్తీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే 1257 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిన మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను శనివారం విడుదల చేసింది. రాత పరీక్షకు హాజరైన ప్రతి అభ్యర్థి సాధించిన మార్కులు, ఇతరత్రా వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. మొత్తం 2322 పోస్టులకుగానూ 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ లిస్టులో ఉన్న వారికి ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి, అనంతరం సెలక్షన్ లిస్ట్ విడుదల చేయనున్నారు. వెంగళరావు నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుండగా... ఎవరెవరు ఎప్పుడు వెరిఫికేషన్‌కు రావాలనే వివరాలను వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని అభ్యర్థులకు బోర్డు సూచించింది. 2024లో 6956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మరో 2322 పోస్టులను భర్తీ చేస్తోంది. దీంతో ప్రభుత్వ హాస్పిటళ్లలో నర్సింగ్ ఆఫీసర్ల కొరత పూర్తిగా తీరిపోనుంది.






