- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Memory loss-Fat: ఆడవారిలో ఎందుకు ఈ సమస్య అధికమవుతుంది.. అసలు కారణం కనిపెట్టిన శాస్త్రవేత్తలు..?

దిశ, వెబ్‌డెస్క్: జీవన శైలిలో మార్పుల కారణంగా.. తీవ్రమైన ఒత్తిడితో మతిమరుపు వస్తుంటుంది. ఈ మెమోరీ లాస్ సాధారణంగా చాలా మంది వస్తుంది. మతిమరుపు అంటే జ్ఞాపకశక్తి కోల్పోవడం. ఇది ఒక వైద్య పరిస్థితి. మతిమరుపుకు కారణాలు చూసినట్లైతే.. జన్యుపరంగా రావొచ్చు జీవన శైలి కారకాలు, పర్యావరణ కారణాలు, ఇన్ఫెక్షన్లు, కొన్ని మందులు వాడడం వల్ల, హైపోక్సియా, మత్తు పదార్థాలు, భావోద్వేగ పరిస్థితులు, తలకు గాయం అవ్వడం కారణంగా, ఆల్కహాల్ అతిగా తీసుకోవడం వల్ల మతిమరుపు సమస్య వెంటాడుతోందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
బద్ధకం, అవగాహనతో సమస్యలు, భ్రాంతులు, గందరగోళం, మూడ్ మార్పులు, అజాగ్రత్త, నిద్రపోవడం, తక్కువ ప్రతిస్పందించడం మతిమరుపు లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మతిమరుపు రావడానికి ముఖ్య కారణం ఇదంటూ తాజాగా నిపుణులు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. రక్తంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉండే పరిస్థితిని హైపర్లిపిడెమియా అంటారు. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలకు ప్రమాద కారకమని నిపుణులు చెబుతున్నారు.
కొలెస్ట్రాల్ అనేది శరీరంలోని సహజమైన కొవ్వు (లిపిడ్). కొలెస్ట్రాల్ హార్మోన్లు, కణ త్వచాలు, కొన్ని విటమిన్లు తయారు చేయడానికి అవసరం. కొలెస్ట్రాల్ కాలేయం ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఆహారం, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలకు జన్యుశాస్త్రం, మధుమేహం, వ్యాయామం, రక్తపోటు వంటివి కొలెస్ట్రాల్ సమస్యకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు గుండెపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యల్ని కూడా తెచ్చిపెడుతుంది.
అయితే ఈ మతిమరుపు సమస్యకు కారణం శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ముఖ్య కారణమని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు. బాడీలో కొవ్వు శరీరంలోని మెదడు నిర్వహణ కార్యకలాపాలతో ముడిపడి ఉంటుందట. కాగా ఈ వ్యవస్థను బలహీనపర్చి.. అది కాస్త అల్జీమర్స్ వ్యాధికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అధిక మొత్తంలో చెడు కొవ్వు చేరితే అది బాడీలోని ఇన్ ఫ్లమేటరీ వ్యవస్థను ప్రభావితం చేయడం ప్రారంభమవుతుంది. అది రిలీజ్ చేసే ఆక్సిడేటివ్ ఒత్తిడ కారణంగా మెదడు గుర్తుంచుకునే శక్తిని కోల్పోతుంది. ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలోనే కనిపిస్తుందని చెబుతున్నారు. ఆడవారిలో మెనొపాజ్ ముందు కొలెస్ట్రాల్ కణాల సంఖ్య పరిణామం పెరగడం వల్ల.. ఇలా జరుగుతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.