ఆపేదే లేదు.. మెగాస్టార్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ 300 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-20 11:35:52  IST  )

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు(Mana Shankara Vara Prasad Garu) (MSG)’ బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది.

ఆపేదే లేదు.. మెగాస్టార్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ 300 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు(Mana Shankara Vara Prasad Garu) (MSG)’ బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన తొలి వారం అంతా అద్భుతమైన వసూళ్లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే బ్రేక్-ఈవెన్‌ను పూర్తి చేసుకుని, ఒక్కో రోజు భారీ కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. భారీ ఓపెనింగ్ తర్వాత కూడా జోరు తగ్గకుండా కొనసాగుతుంది. తాజాగా, రూ.300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఈ ఘనతను తెలియజేస్తూ మూవీ మేకర్స్ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, విదేశీ మార్కెట్లలో కూడా ‘MSG’ సత్తా చాటుతోంది.

ముఖ్యంగా ఉత్తర అమెరికాలో చిరంజీవి, అనిల్ రావిపూడి గత చిత్రాల రికార్డులను బ్రేక్ చేస్తూ $2.96 మిలియన్లకు పైగా వసూలు చేసి, $3 మిలియన్ మార్క్‌కు అత్యంత సమీపంలో ఉంది. ఇదే ఊపు కొనసాగితే, ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి కెరీర్‌లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిరంజీవి అపారమైన స్టార్ పవర్, వరుస హిట్‌లతో తన మార్క్ చూపిస్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వం, పాజిటివ్ మౌత్ టాక్, కుటుంబ ప్రేక్షకుల భారీ ఆదరణ అన్ని కలసి ‘MSG’ని సంక్రాంతి విజేతగా నిలిపాయి. మెగాస్టార్ ఆరాతో పాటు హృదయాన్ని తాకే భావోద్వేగాలు, పూర్తి స్థాయి వినోదం కలిసిన ఈ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎంతటి పోటీ ఉన్నా బాక్సాఫీస్‌ను శాసించగలదని మరోసారి నిరూపిస్తోంది.

Read More... మ‌న శంక‌ర్ వ‌ర ప్ర‌సాద్ గారు సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ

Next Story