- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనిల్ రావిపూడికి బంపర్ ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్.. కామెంట్స్ వైరల్
అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu)చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

దిశ, సినిమా: అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu)చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. నయనతార కీలక పాత్రలో మెరిసిన ఈ సినిమాలో వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించి.. మరో ప్లస్ అయ్యారు. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉండటంతో మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. ఈ విజయంతో దర్శకుడు అనిల్ రావిపూడిపై చిరంజీవి మరింత నమ్మకం వ్యక్తం చేశారు. తాజాగా విడుదలైన ప్రమోషనల్ వీడియోలో మెగాస్టార్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటూ, అనిల్ రావిపూడికి మరోసారి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వెల్లడించారు.
తనను కొత్తగా ప్రెజెంట్ చేయడమే కాకుండా, ప్రేక్షకులను నవ్వించడంలో అనిల్ సక్సెస్ అయ్యాడని చిరు ప్రశంసలు కురిపించారు. అలాగే వెంకటేష్ తన సినిమాలో ఎంత అద్భుతంగా నటించి సందడి చేశారో, అదే విధంగా తాను కూడా వెంకటేష్ సినిమాలో నటించేందుకు పూర్తిగా రెడీగా ఉన్నానని చిరంజీవి స్పష్టం చేశారు. అనిల్ రావిపూడి ఇద్దరికీ సమాన ప్రాధాన్యత కలిగిన పాత్రలను రాసి స్క్రిప్ట్ రెడీ చేస్తే, ఆ సినిమాలో నటించేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు.
ఒకవేళ ఇద్దరి పాత్రలకు సమాన స్కోప్ లేకపోయినా, తాను చిన్న కామియో రోల్ అయినా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం గమనార్హం. వెంకటేష్ కోసం, అనిల్ రావిపూడి స్క్రిప్ట్ అయితే ఎలాంటి పాత్రకైనా ఓకే అన్న మెగాస్టార్ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఈ వ్యాఖ్యలతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి - వెంకటేష్ కలిసి మరోసారి స్క్రీన్ పంచుకోనున్నరని అర్థమవుతోంది. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






