ఛాన్స్ మిస్ అయింది.. తాప్సీపై మెగాస్టార్ ప్రశంసలు

by Disha Web |
ఛాన్స్ మిస్ అయింది.. తాప్సీపై మెగాస్టార్ ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: తాప్సీ నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ బుధవారం సాయంత్రం జరిగింది. ఈ ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. నిర్మాత నిరంజన్‌రెడ్డితో తనకున్న ప్రేమ, ప్రత్యేక అనుబంధం కారణంగానే ఈ వేడుకకు హాజరయ్యానని చెప్పారు. ఆయన ఒక డైనమిక్ లాయర్‌గా, నిర్మాతగా, నిర్ణయాధికారుడని పొగడ్తలతో ముంచెత్తాడు.

ఈ క్రమంలో తాప్సీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, ఝుమ్మంది నాదం సినిమాలో బబ్లీగా కనిపించడం నుండి బాలీవుడ్ సినిమాల్లో పవర్‌ఫుల్ పాత్రలు చేస్తూ స్ట్రాంగ్ హీరోయిన్‌గా నిరూపించుకుందని అన్నారు. అయితే కొన్ని నిర్ణయాల కారణంగా ఆమెతో నటించే ఛాన్స్ మిస్ అయినందుకు చింతిస్తున్నానని చెప్పాడు. ఆమెతో ఏదో ఒక రోజు స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నానని, తాప్సీకి, తనకి ప్రధాన పాత్రలలో ఒక సినిమా ప్లాన్ చేయమని నిరంజన్ రెడ్డిని చిరు ఫన్నీగా అభ్యర్థించాడు. చిన్న సినిమాలను ప్రోత్సహించాలని.. ఈ చిత్రం చూడటానికి వెళ్ళే ఎవరినీ నిరాశపరచదని హామీ ఇస్తూ తన ప్రసంగాన్ని ముగించాడు.


Next Story

Most Viewed