Ghani: గ్రాండ్‌గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'గని' ఈవెంట్

by Disha Web Desk 2 |
Ghani: గ్రాండ్‌గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని ఈవెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'గని' చిత్రం రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ఫస్ట్‌లుక్‌‌కు విశేష స్పందన లభించింది. ఇప్పటికే చిత్ర ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో నిర్వహించారు. ప్రస్తుతం 'ఫస్ట్ పంచ్' పేరుతో ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో సునీల్‌శెట్టి, ఉపేంద్ర, జగపతిబాబు, నవీన్‌ చంద్రలు కీలక పాత్రలు పోషించారు. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.



Next Story

Most Viewed