Lavanya Tripathi: ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మెగా కోడలు.. ప్రతీ వారం ఆ పని చేస్తానంటూ పోస్ట్

by Chukka Sudharani |   (  Updated:2024-11-25 16:32:18  IST  )

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Lavanya Tripathi: ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మెగా కోడలు.. ప్రతీ వారం ఆ పని చేస్తానంటూ పోస్ట్
X

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యారేజ్ (marriage) అనంతరం వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తున్నాడు. అంతే కాకుండా ఇటీవల ‘మట్కా’ (Matka) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే.. ఈ చిత్రం కూడా వరుణ్‌కు అంతగా కలిసిరాలేదు. ఇదిలా ఉంటే.. ఈ పెళ్లి తర్వాత లావణ్య మాత్రం సినిమాలకు దూరం అయింది. ప్రజెంట్ సినిమాలు ఏమి అనౌన్స్ చెయ్యకుండా సోషల్ మీడియా (Social Media)కే పరిమితం అయిపోయింది.

ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు పెట్టిన పోస్ట్ ప్రజెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మేరకు ఫుడ్ ప్రిపేర్ (food prep) చేస్తున్న వీడియో షేర్ చేస్తూ.. ‘ప్రతి వారం మా కుటుంబం కలిసి వంట చేస్తాము. అలాగే ఆ ఫుడ్‌ను ప్యాక్ చేసి అవసరమైన వారితో పంచుకుంటాము. ఇది కేవలం ఇవ్వడం గురించి కాదు.. ఈ ప్రక్రియలో మన హృదయాలను నింపే ఆనందం, ప్రేమ అండ్ కృతజ్ఞత నిండి ఉంటోంది’ అంటూ నోట్ షేర్ చేసింది. ప్రజెంట్ ఈ వీడియో వైరల్ కావడంతో మెగా కోడలు లావణ్య త్రిపాఠిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more...

Samantha: ‘కిస్సిక్’ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్ ఇదే.. పోస్ట్ వైరల్

Next Story