- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెడికల్ పీజీ కటాఫ్ 'జీరో'కు తగ్గింపు.. దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమైన డాక్టర్ల సంఘం
నీట్ పీజీ (NEET-PG) 2025-26 కటాఫ్ పర్సంటైల్‌ను 'సున్నా'కు తగ్గిస్తూ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: నీట్ పీజీ (NEET-PG) 2025-26 కటాఫ్ పర్సంటైల్‌ను 'సున్నా'కు తగ్గిస్తూ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) నిర్ణయం తీసుకుంది. కాగా ఎన్బీఈ నిర్ణయాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (FAIMA) తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాసింది. ఈ నిర్ణయం వల్ల మైనస్ 40 మార్కులు వచ్చిన వారు కూడా స్పెషలిస్ట్ డాక్టర్ కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుందని, ఇది వైద్య విద్య యొక్క పవిత్రతను, నాణ్యతను పూర్తిగా దెబ్బతీస్తుందని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లను భర్తీ చేయడం కోసమే మెరిట్‌ను పక్కనబెట్టి ఇలాంటి అశాస్త్రీయమైన నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వారు స్పష్టం చేశారు.
అర్హత ప్రమాణాలను ఇలా భారీగా తగ్గించడం వల్ల భవిష్యత్తులో రోగుల భద్రతకు, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని FAIMA హెచ్చరించింది. ప్రభుత్వం తక్షణమే ఈ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుని, మెరిట్ ఆధారిత కటాఫ్‌ను పునరుద్ధరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గని పక్షంలో, దేశవ్యాప్తంగా ఉన్న రెసిడెంట్ డాక్టర్లతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని సంఘం నేతలు ఈ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ హెచ్చరించారు.






