ఏరియా ఆసుపత్రుల్లోనే మెడికల్ అన్‌ఫిట్ నిర్వహించాలి

by Batti.Sumithra |

సింగరేణి కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 1998 విధానంలోనే మెడికల్ బోర్డును నిర్వహించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాస్‌రావు డిమాండ్ చేశారు.

ఏరియా ఆసుపత్రుల్లోనే మెడికల్ అన్‌ఫిట్ నిర్వహించాలి
X

దిశ, రెబ్బెన : సింగరేణి కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 1998 విధానంలోనే మెడికల్ బోర్డును నిర్వహించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాస్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం కైరిగూడ ఓపెన్‌కాస్ట్‌ను సందర్శించిన ఆయన కార్మికుల సమస్యలను తెలుసుకుని మాట్లాడుతూ గత 16 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో ఉద్యోగులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెరగడంతో మెడికల్ అన్‌ఫిట్ కాని ఉద్యోగులు అదనపు కాలం విధులు నిర్వర్తించాల్సి వస్తోందని తెలిపారు.

ఏఐటీయూసీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం బెల్లంపల్లి ఏరియా ఉద్యోగులకు బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలోనే, శ్రీరాంపూర్, మందమర్రి ప్రాంత ఉద్యోగులకు రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలోనే మెడికల్ అన్‌ఫిట్ నిర్వహించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇప్పుడు మెడికల్ బోర్డు నిర్వహించి దానిని తమ ఘనతగా చెప్పుకోవడం విడ్డూరమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా కార్యదర్శి మారిన వెంకటేష్, పిట్ కార్యదర్శి బొంగు వెంకటేష్, సెంట్రల్ కమిటీ నాయకులు ఓరం కిరణ్, ఏరియా నాయకులు జూనియర్ తిరుపతి, కాయిత స్వామి, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి మారిన చందర్, రాజేశం, రాజమౌళి, సంగి ప్రశాంత్, రవీందర్, అజీమ్, భిక్షపతి, రమేష్, మల్లేష్, కుమారస్వామి, రెడ్డి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story