ఆంజనేయస్వామి అనుగ్రహంతో వర్షాలు సమృద్ధిగా కురవాలి

by Ratna Kumari |

ఆంజనేయస్వామి అనుగ్రహంతో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆకాంక్షించారు.

ఆంజనేయస్వామి అనుగ్రహంతో వర్షాలు సమృద్ధిగా కురవాలి
X

దిశ, చిన్నశంకరంపేట : ఆంజనేయస్వామి అనుగ్రహంతో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం చిన్నశంకరంపేట మండలం కామారం తండాలో నిర్వహించిన హనుమాన్ దేవాలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎల్‌నీనో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆంజనేయస్వామి అనుగ్రహంతో కరువు నివారించి, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, స్వామివారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అలాగే స్వామివారి కృపతో గ్రామం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హలవత్ మోహన్ నాయక్, వినోద్ కుమార్ నాయక్, రాములు నాయక్, తారాచంద్ నాయక్‌తో పాటు తండా పెద్దలు పాల్గొన్నారు.

Next Story