- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కడ అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: నాగబాబు కీలక ప్రకటన
వచ్చే ఎన్నికలపై జనసేన పార్టీ ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. గిరిజన హక్కుల పరిరక్షణ, వారి జీవన ప్రమాణాల మెరుగుదల వంటి అంశాలపై అక్కడి జనసేన నేతలకు సూచన చేస్తున్నారు..

దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికలపై జనసేన పార్టీ(Janasena Party) ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు(Nagababu) గ్రామాల్లో పర్యటిస్తున్నారు. గిరిజన హక్కుల పరిరక్షణ, వారి జీవన ప్రమాణాల మెరుగుదల వంటి అంశాలపై అక్కడి జనసేన నేతలకు సూచన చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పట్టుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.
అరకు పార్లమెంట్‌లో నాగబాబు పర్యటన..
తాజాగా నాగబాబు అరకు పార్లమెంట్‌లో పర్యటించారు. రాబోయే ఎన్నికల్లో అరకు పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గిరజన ప్రాంతాల అభివృద్ధి, వారి సంక్షేమమే లక్ష్యంగా తాము పని చేస్తున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను 100 శాతం నిలబెడతామని తెలిపారు. ఇప్పటికే ఆ వైపుగా ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు చెప్పారు. అరకు పార్లమెంట్ స్థానంతో పాటు అన్ని అసెంబ్లీలో స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని, అంతేకాకుండా అత్యధిక స్థానాల్లో గెలిచే విధంగా కార్యచరణ రూపొందిస్తామని నాగబాబు స్పష్టం చేశారు.
పవన్ సైతం...
ఇక ఇదే దిశగా పవన్ కల్యాణ్ సైతం అడుగులు వేశారు. ఇందులో భాగంగానే పంచాయతీరాజ్ శాఖను ప్రత్యేకంగా తీసుకోవడంతో పాటు భారీ నిధులు కూడా కేటాయించారు. అటవి తల్లి బాట కార్యక్రమంలో గిరిజన ఆవాసాలకు రోడ్ల నిర్మాణానికి రూ. 1005 కోట్లు ఖర్చు చేశారు. తద్వారా 1069 కిలో మీటరల్ పొడవైన రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇక ఈ విషయాలన్ని అటు నాగబాబు సైతం పలుమార్లు స్పష్టం చేశారు. ఇప్పుడు తాజాగా గిరిజన ప్రాంతాల్లో పూర్తిగా జనసేన పోటీ చేసేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చూడాలి.






