ఇండియన్ యువతిని పెళ్లాడిన మ్యాక్స్‌వెల్..

by Disha Web Desk 19 |
ఇండియన్ యువతిని పెళ్లాడిన మ్యాక్స్‌వెల్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. భారత్‌కు చెందిన విని రామన్‌‌ అనే యువతితో నాలుగు సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉన్న మాక్సీ.. ఇవాళ క్రైస్తవ వివాహ పద్దతిలో పెళ్లి చేసుకుని వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. ఇన్స్టాగ్రామ్ వేదిక తమ పెళ్లికి సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేసి.. "మిస్టర్ అండ్ మిసెస్ మాక్స్వెల్ 18.03.22" అని రాసుకొచ్చారు. కాగా, మార్చి 27న ఈ లవ్‌బర్డ్స్ తమిళ-బ్రాహ్మణ సంప్రదాయ పద్దతిలో మరోసారి వివాహం చేసుకోనున్నారు. సోషల్ మీడియాలో ఈ నూతన జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. మాక్స్‌వెల్‌కు భారత్‌లో కూడా చాలా మంది అభిమానులున్నారు. ఐపీఎల్ ద్వారా క్లోటాది మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న మాక్సీ.. 15వ సీజన్‌లో ఆర్సీబీ నుండి బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే.

Next Story