- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాళం వేసిన ఇంట్లో అర్ధరాత్రి భారీ చోరీ
మండల కేంద్రంలో నిన్న(గురువారం) రాత్రి గుర్తు తెలియని దుండగులు నాలుగు తులాల బంగారం, రూ.70 వేల నగదు ఎత్తుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది,

దిశ, నేరడిగొండ: మండల కేంద్రంలో నిన్న(గురువారం) రాత్రి గుర్తు తెలియని దుండగులు నాలుగు తులాల బంగారం, రూ.70 వేల నగదు ఎత్తుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జహీర్ ఆటో డ్రైవర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బోథ్ తన అత్తగారి ఇంటి వద్ద ఫంక్షన్ ఉండడంతో జహీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం అత్తగారింటికి వెళ్లాడు. అదే రోజు రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళం కప్పు పగలగొట్టి బీరువాలో ఉన్న రూ.70 వేలు, నాలుగు తులాల బంగారం ఎత్తుకెళ్లినట్టు కుటుంబీకులు తెలిపారు. అంతేకాకుండా దొంగతనానికి పాల్పడ్డ ఒక వ్యక్తి చెప్పులను వారి మంచం వద్దనే వదిలేశారని అన్నారు. కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీస్ సిబ్బంది వచ్చి పరిశీలించారని తెలిపారు. అంతేకాకుండా దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తులను పట్టుకొని వారు దొంగిలించిన నగదును బంగారాన్ని తిరిగి ఇప్పించాలని పోలీస్ సిబ్బందిని కోరుతున్నట్లు బాధితులు తెలిపారు.






