ఆర్‌బీఐ కీలక నిర్ణయం: వరుసగా 20వ సారి రెపో రేటు యథాతథం

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-05 05:04:37  IST  )

ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) కీలక నిర్ణయాలను గవర్నర్ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు.

ఆర్‌బీఐ కీలక నిర్ణయం: వరుసగా 20వ సారి రెపో రేటు యథాతథం
X

దిశ, వెబ్‌‌డెస్క్: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సామాన్య రుణగ్రహీతలకు, ఆర్థిక మార్కెట్లకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడంతో పాటు ఆర్థిక వృద్ధిని స్థిరంగా కొనసాగించే లక్ష్యంతో.. ప్రధాన వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచినట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. ముంబైలో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష (MPC) సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి రెపో రేటులో (Repo Rate) ఎలాంటి మార్పులు చేయడం లేదని, దానిని 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ తగ్గించింది. జీడీపీ వృద్ధి అంచనాను 69.9 నుంచి 6.6 శాతానికి తగ్గించారు.

స్థిరంగానే వడ్డీ రేట్లు..

కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ సవరించకుండా స్థిరంగా ఉంచడం ఇది వరుసగా 20వ సారి కావడం గమనార్హం. అంతర్జాతీయంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు, దేశీయంగా ఆహార ద్రవ్యోల్బణ హెచ్చుతగ్గులను నిశితంగా పరిశీలిస్తున్న కేంద్ర బ్యాంకు, ప్రస్తుతానికి వడ్డీ రేట్ల తగ్గింపుపై ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదని భావించింది. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బ్యాంకుల నుంచి హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్లు తీసుకున్న వారిపై అదనపు నెలవారీ ఈఎంఐ (EMI) భారం పడదు. లోన్ రేట్లు ప్రస్తుతానికి స్థిరంగానే కొనసాగనున్నాయి.

Next Story