- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిగ్రీ ముఖ్యమా? స్కిల్స్ ముఖ్యమా? ఈ అమ్మాయి సక్సెస్ స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు
ఒకప్పుడు ఉద్యోగం కావాలంటే డిగ్రీలు ఉండాలి. కొందరు డిగ్రీలు, పీజీలు, పీహెచ్ డీలు చేసి కంపెనీల చుట్టూ ఉద్యోగాల కోసం తిరిగేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. డిగ్రీ ఫెయిల్ అయినా, డిగ్రీ చేయకపోయినా స్కిల్స్ ఉంటే చాలు పిలిచి ఉద్యోగం ఇస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు ఉద్యోగం కావాలంటే డిగ్రీలు ఉండాలి. కొందరు డిగ్రీలు, పీజీలు, పీహెచ్ డీలు చేసి కంపెనీల చుట్టూ ఉద్యోగాల కోసం తిరిగేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. డిగ్రీ ఫెయిల్ అయినా, డిగ్రీ చేయకపోయినా స్కిల్స్ ఉంటే చాలు పిలిచి ఉద్యోగం ఇస్తున్నారు. తాజాగా ఓ యువతికి డిగ్రీ లేకపోయినా ఎంబీఏ, ఐదేళ్ల ఎక్స్ పీరియన్స్ అర్హత ఉండాల్సిన ఉద్యోగాన్ని ఓ ప్రముఖ కార్ల కంపెనీ పిలిచి మరీ ఇచ్చింది. దానికి కారణం ఆమెకు లింక్డ్ ఇన్ లో ఉన్న ఫాలోవర్సే. గౌరీ అనే 19ఏళ్ల యువతి ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది.
ఆమె ఉద్యోగ సమాచారాన్ని పంచుకునే లింక్డ్ ఇన్ యాప్ లో తరచూ మార్కెటింగ్, బ్రాండింగ్ గురించి తన అభిప్రాయాలను చెబుతూ ఉంటుంది. దీంతో ఆమె ప్రొఫైల్ ఉద్యోగానికి పోర్ట్ ఫోలియోగా మారిపోయింది. గౌరీ ప్రొఫైల్ చూసిన బీఎండబ్ల్యూ కార్ల కంపెనీ పిలచి మరీ తమ కంపెనీలో ఎంబీఏ అర్హత కలిగిన ఉద్యోగాన్ని ఇచ్చింది. అంతే కాకుండా ప్యాకేజీ కూడా ఆమె ఊహించని స్థాయిలో ఇచ్చింది. ప్రస్తుతం బీఎండబ్ల్యూ గౌరీకి ఉద్యోగం ఆఫర్ చేస్తూ పంపిన సందేశాల స్క్రీన్ షాట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
కొందరు అందరికీ గౌరీకి ఉన్నట్టుగా అదృష్టం ఉండదని అంటున్నారు. కానీ నిజానికి ప్రస్తుతం ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా మొదట చూసేది ఇంటర్నెట్ లోనే ఇలాంటి ఇంటర్నెట్ యుగంలో గౌరీ తన స్కిల్స్ ప్రదర్శిస్తూ లింక్డ్ ఇన్ లో 60వేల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఆమె ఫాలోవర్స్ పెరిగారు అంటే మార్కెంటింగ్ స్కిల్స్ ఆమెకు ఉన్నట్టే. ఇప్పుడు అవే స్కిల్స్ ఆమెకు ఉద్యోగాన్ని కూడా తెచ్చిపెట్టాయి. దీంతో డిగ్రీల కంటే స్కిల్స్ ఏ ముఖ్యం అనే వాదనలకు మరోసారి బలం చేకూరింది.






