సర్కారు భూమికి సంరక్షణే కరువాయే!?

by Jakkula.Mamatha |

మౌనం అర్ధాంగీకారమనేది నానుడి. కానీ దాన్ని నిజం చేస్తున్నట్లుంది ముదిగొండ రెవెన్యూ అధికారుల తీరు.

సర్కారు  భూమికి సంరక్షణే కరువాయే!?
X

దిశ,ముదిగొండ: మౌనం అర్ధాంగీకారమనేది నానుడి. కానీ దాన్ని నిజం చేస్తున్నట్లుంది ముదిగొండ రెవెన్యూ అధికారుల తీరు. ప్రభుత్వ భూమి అని గుర్తించి, తాఖీదులు ఇచ్చి కూడా నెలల తరబడి ఆ నోటీసులను సుప్త చేతనావస్థలో ఉంచిన తీరు అనేక అనుమానాలకు తావిస్తుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని సువర్ణపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 375లో 2.35 కుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమి పక్కనే ఉన్న కొంతమంది బడా బాబులు సర్కారు భూమిని ఆక్రమించారని ‘దిశ’ పత్రికలో ప్రచురించగా స్పందించిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలానికి వెళ్లి ప్రభుత్వ భూమి అక్రమానికి గురైందని గుర్తించి ఆక్రమించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు.

నోటీసులు ఇచ్చిన పని దినాలలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ను తొలగించాల్సి ఉండగా అక్రమార్కులు మాత్రం తగ్గేదే లేదంటూ నోటీసులు ఇచ్చిన లెక్క చేయకుండా కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని దర్జాగా అనుభవిస్తున్నారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వ భూములపై పర్యవేక్షణ చేయాల్సిన అధికారులే ఫిర్యాదులు చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల అధికారుల పనితీరుపై పలు అనుమానాలకు దారితీస్తోంది. ప్రభుత్వ భూమి అక్రమానికి గురైందని తెలిసి కూడా అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్న అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని స్వాధీన పరచుకొని ప్రభుత్వ భూమి చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు, మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story