ఏపీలో కదిలే రైలు ఇంజన్‌పై రాళ్ల దాడి చేసిన దుండగులు

by Ajay Maddhiboyina |

ఏపీలో క‌దిలే రైలు ఇంజ‌న్ పై దుండ‌గులు రాళ్ల దాడి చేశారు. దీంతో ఇంజ‌న్ అద్దాలు ప‌గిలిపోయి లోకో పైల‌ట్ జ‌య‌రామ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఢిల్లీ నుండి చెన్నై వెళుతున్న రైలుపై సింగ‌రాయ‌కొండ స‌మీపంలో రాళ్ల‌తో దాడి చేశారు.

ఏపీలో కదిలే రైలు ఇంజన్‌పై రాళ్ల దాడి చేసిన దుండగులు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో క‌దిలే రైలు ఇంజ‌న్ పై దుండ‌గులు రాళ్ల దాడి చేశారు. దీంతో ఇంజ‌న్ అద్దాలు ప‌గిలిపోయి లోకో పైల‌ట్ జ‌య‌రామ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఢిల్లీ నుండి చెన్నై వెళుతున్న రైలుపై సింగ‌రాయ‌కొండ స‌మీపంలో రాళ్ల‌తో దాడి చేశారు. దీంతో లోకో పైల‌ట్ రైలును స‌మీపంలోని యూపీ స్టేష‌న్ లో ఆపేశారు. ముఖంపై గాజు ముక్క‌లు గుచ్చుకుని లోకో పైట‌ట్ గాయ‌ప‌డ‌టంతో అధికారుల‌కు అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ఎవ‌రైనా ఆక‌తాయిలు ఈ ప‌ని చేశారా.. లేదా దుండ‌గులు కావాల‌నే దాడికి పాల్ప‌డ్డారా అనే కోణంలో విచారిస్తున్నారు. అయితే క‌దులుతున్న రైలుపై ఈ స్థాయిలో దాడి చేయ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. త‌ర‌చూ ప‌గ‌లు, రాత్రి తేడా లేకుండా వెళ్లే రైళ్ల‌పై దాడి చేయ‌డంతో లోకోపైల‌ట్ లు టెన్ష‌న్ ప‌డుతున్నారు. నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Next Story