- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరుస ఫ్లాపుల తర్వాత హిట్ కోసం వైష్ణవ్ తేజ్ భారీ స్కెచ్.. ఆ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్!
గత మూడేళ్లలో ఆయన ఏకంగా 100కు పైగా కథలను విన్నట్లు టాక్. ఎన్నో కథలను తిరస్కరించిన తర్వాత, ఎట్టకేలకు ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఖరారు చేసుకున్నట్లు సమాచారం.

దిశ, సినిమా: మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటారు. మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వత రంగరంగ వైభవంగా, కొండ పొలం వంటి చిత్రాలు చేసినప్పటికీ వైష్ణవ్ తేజ్ హిట్ అందుకోలేకపోయారు. ఇక 2023లో చేసిన ఆదికేశవ కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఇలా వరుసగా మూడు ఫ్లాపులు రావడంతో వైష్ణవ్ తేజ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. తదుపరి సినిమా విషయంలో ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చారు. కేవలం హిట్ కోసమే కాకుండా, తన నటనకు సరిపోయే వైవిధ్యమైన కథ కోసం వేట ప్రారంభించారు. ఈ క్రమంలో.. గత మూడేళ్లలో ఆయన ఏకంగా 100కు పైగా కథలను విన్నట్లు టాక్. ఎన్నో కథలను తిరస్కరించిన తర్వాత, ఎట్టకేలకు ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఖరారు చేసుకున్నట్లు సమాచారం.
దర్శకుడు మహేష్ ఎస్ చెప్పిన ఒక అద్భుతమైన కథాంశం నచ్చడంతో వైష్ణవ్ తేజ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన AK ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఆ వెంటనే సినిమా షూటింగ్‌ను కూడా ప్రారంభించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. లాంగ్ గ్యాప్ తర్వాత వైష్ణవ్ తేజ్ ఒక మంచి కథతో వస్తుండటంతో మెగా అభిమానుల్లో సరికొత్త ఆశలు చిగురించాయి. 100 కథలు విని ఓకే చేసిన ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ మళ్లీ ‘ఉప్పెన’ లాంటి ఘన విజయాన్ని అందుకుని, సక్సెస్ ట్రాక్‌లోకి ఎక్కుతారని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






