- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాంసర్ సైట్లలో భారత్ సెంచరీ.. ప్రధాని మోడీ హర్షం
యూపీలోని జై ప్రకాష్ నారాయణ్ పక్షుల అభయారణ్యం దేశంలోనే 100వ రాంసర్ సైట్‌గా గుర్తింపు పొందడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ 100వ రాంసర్ సైట్‌గా ఉత్తరప్రదేశ్‌లోని 'జై ప్రకాష్ నారాయణ్ పక్షుల అభయారణ్యం' నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తర ఎక్స్(Twitter) వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. " రాంసర్ సైట్ల (రక్షిత చిత్తడి నేలలు) గుర్తింపులో భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ అపూర్వ ఘట్టంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ అభయారణ్యం పక్షుల జీవవైవిధ్యానికి (Avifaunal Biodiversity) పుట్టినిల్లని, అనేక రకాల దేశీయ, వలస పక్షులను ఇది విశేషంగా ఆకర్షిస్తుందని ప్రధాని తన ట్వీట్ ద్యారా కొనియాడారు.
ప్రకృతి సంరక్షణకు నిదర్శనం
మన సహజ పర్యావరణాన్ని, ముఖ్యంగా చిత్తడి నేలలను (Wetlands) రక్షించడంలో భారతదేశానికి ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఈ మైలురాయి ఒక స్పష్టమైన నిదర్శనమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా, స్థానిక ప్రజల భాగస్వామ్యం, సైన్స్, నూతన ఆవిష్కరణలు, అవగాహన కార్యక్రమాల ద్వారా చిత్తడి నేలల పరిరక్షణ, పునరుజ్జీవన ప్రయత్నాలు దేశంలో మరింత బలోపేతం అయ్యాయని ఆయన వివరించారు. ఈ రకమైన సామూహిక ప్రయత్నాలు జీవవైవిధ్యాన్ని కాపాడటానికి, పర్యావరణ సమతుల్యతను సురక్షితం చేయడానికి, రాబోయే తరాలకు హరిత భవిష్యత్తును అందించడానికి ఎంతగానో తోడ్పడుతున్నాయని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.






