Gayathri Ramana: పొట్టి వైట్ డ్రెస్‌లో బెడ్‌పై అందాలు ఆరబోసిన హాట్ బ్యూటీ

by Pulgam srinivas |   (  Updated:2026-06-05 05:02:27  IST  )

హాట్ ఫోటోలతో హీట్ పెంచిన గాయత్రి రమణ.

Gayathri Ramana: పొట్టి వైట్ డ్రెస్‌లో బెడ్‌పై అందాలు ఆరబోసిన హాట్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: అందాల ముద్దుగుమ్మ గాయత్రి రమణ తాజాగా ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో తన అందంతో పాటు అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ముఖ్యంగా ఈ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. సోషల్ మీడియాలో కూడా గాయత్రి రమణ చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోషూట్స్‌కు సంబంధించిన చిత్రాలను పంచుకుంటూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని స్టైలిష్ ఫోటోలను షేర్ చేసింది.

ఈ ఫోటోలలో గాయత్రి వైట్ కలర్ పొట్టి టైట్ డ్రెస్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. బెడ్‌పై కూర్చొని, అలాగే నిలబడి డిఫరెంట్ యాంగిల్స్‌లో స్టైలిష్ పోజులు ఇస్తూ తన అందాలను మరింత హైలైట్ చేసింది.

చేతికి బ్రాస్‌లెట్, చెవులకు అందమైన ఇయర్‌రింగ్స్ ధరించి, జుట్టును స్టైలిష్‌గా ముడివేసుకుంది. అలాగే తన డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే హై హీల్స్ ధరించడం ఆమె లుక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మొత్తంగా ఈ ఫోటోల్లో గాయత్రి రమణ తన గ్లామర్‌తో అభిమానులను ఫిదా చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story