షాక్ కొట్టిన కరెంట్ బిల్లు..! సాధారణ ఇంటికి రూ. 1.27 కోట్ల విద్యుత్ చార్జీలు.. చూసి అవాక్కైన కుటుంబం

by Jakkula.Mamatha |

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త తండాలో ఓ సాధారణ గృహానికి వచ్చిన విద్యుత్ బిల్లు కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చింది.

షాక్ కొట్టిన కరెంట్ బిల్లు..! సాధారణ ఇంటికి రూ. 1.27 కోట్ల విద్యుత్ చార్జీలు.. చూసి అవాక్కైన కుటుంబం
X

దిశ, హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త తండాలో ఓ సాధారణ గృహానికి వచ్చిన విద్యుత్ బిల్లు కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చింది. కొత్త తండాకు చెందిన రమావత్ రవి తన భార్య రమావత్ రాణి పేరుతో ఒక కరెంటు మీటర్ ని తీసుకున్నాడు. తన విద్యుత్ బిల్లు నెల వారికి 200 లోపు యూనిట్లు రావడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత కరెంటు పథకం వారికి వర్తిస్తుంది. కరెంట్ బిల్లు ఈసారి ఏకంగా రూ.1 కోటి 27 లక్షల 79 వేల 406 రూపాయలు రావడంతో ఇంటి యజమాని ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రతినెల ఫ్రీ కరెంట్ వస్తుంటే ఇలా రావడం ఏందని రీడింగ్ తీసే వ్యక్తిని ప్రశ్నించాడు. కొన్ని సాంకేతిక కారణాలతో వచ్చి ఉండవచ్చునని అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ప్రతి నెల జీరో వచ్చే బిల్లు ఒకేసారి ఇంత భారీ మొత్తంలో చిన్న ఇంటిలో నివసిస్తూ, రోజువారీ అవసరాలకే విద్యుత్ వినియోగిస్తున్న కుటుంబానికి ఇంత భారీ మొత్తంలో బిల్లు రావడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

బిల్లును చూసిన స్థానికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.విషయం తెలుసుకున్న బాధిత కుటుంబం వెంటనే విద్యుత్ అధికారులను సంప్రదించగా, ఇది సాంకేతిక లోపం లేదా మీటర్ రీడింగ్ నమోదు సమయంలో జరిగిన పొరపాటు కావచ్చని అధికారులు తెలిపారు. వినియోగ వివరాలను పరిశీలించి సరైన బిల్లు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.అయితే ఇలా కరెంట్ బిల్లు రావడానికి కారణం కరెంటు మీటరా..!? లేక రీడింగ్ తీసే మిషన్ ..!? సాంకేతిక కారణమా.. అనే సందేహాలు ప్రజలలో వ్యక్తం అవుతున్నాయి. ఈ కరెంట్ బిల్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ప్రజలలో చర్చ జరుగుతుంది. ఈ బిల్లును చూసి కరెంటు వినియోగదారులలో ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యుత్ శాఖ బిల్లింగ్ వ్యవస్థలో లోపాలను వెంటనే అధికారులు సరి చేశారు.

Next Story