- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎంఆర్‌ఎల్ పై ఈడీ విచారణకు కేరళ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సీఎంఆర్‌ఎల్ - ఎక్సాలాజిక్ ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణకు కేరళ హైకోర్టు అనుమతి.

దిశ, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (CMRL) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎంఆర్‌ఎల్ పై ఈడీ విచారణకు కేరళ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.CMRL, ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ సంస్థల మధ్య జరిగిన వివాదాస్పద ఆర్థిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తునకు కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ వ్యవహారంలో ఈడీ తన విచారణను కొనసాగించవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ కేసులో ఈడీ విచారణకు అనుమతినిస్తూ గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీఎంఆర్‌ఎల్ (CMRL) యాజమాన్యం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను జస్టిస్ ఎ. రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి. జయకుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పూర్తిగా కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు లేవని పేర్కొంటూ, దర్యాప్తు సంస్థ తన విచారణను నిరభ్యంతరంగా ముందుకు తీసుకెళ్లవచ్చని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో సదరు సంస్థల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు ఈడీకి సర్వాధికారాలు లభించినట్లయింది.






