కొరటికల్‌లో భారీ చోరీ

by Ratna Kumari |

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కొరటికల్ గ్రామంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన కొలిపాక చంద్రశేఖర్ తన పని నిమిత్తం వారం రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లాడు.

కొరటికల్‌లో భారీ చోరీ
X

దిశ, ఆత్మకూరు(ఎం) : యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కొరటికల్ గ్రామంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన కొలిపాక చంద్రశేఖర్ తన పని నిమిత్తం వారం రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లాడు. ఆదివారం రాత్రి గ్రామానికి తిరిగి వచ్చి ఇంటికి చేరుకోగా తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించాడు. లోపలికి వెళ్లి చూడగా ఇంట్లోని సామగ్రి చెల్లాచెదురుగా ఉండటంతో పాటు సుమారు 20 తులాల వెండి సామగ్రి, వంట సామగ్రి, 43 అంగుళాల టెలివిజన్ కనిపించకపోవడంతో చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు బాధితుడు అనుమానం వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story