- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు
ఈ రోజు తెల్లవారుజాము ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకొని ఒకరు మృతి చెందగా 9 మంది గల్లంతయ్యారు. ఈ షాకింగ్ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో అర్కి (Arki) ప్రాంతంలోని పాత బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు తెల్లవారుజాము ఓ ఇంట్లో అగ్నిప్రమాదం (fire hazard) చోటు చేసుకొని ఒకరు మృతి చెందగా 9 మంది గల్లంతయ్యారు. ఈ షాకింగ్ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో అర్కి (Arki) ప్రాంతంలోని పాత బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది. తెల్లవారుజామున 2:00 - 2:30 గంటల సమయంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నేపాల్‌కు చెందిన ఒక చిన్నారి మృతి చెందగా, మరో తొమ్మిది మంది వలస కూలీలు (నాలుగురు పెద్దలు, ఐదుగురు పిల్లలు) మంటల్లో చిక్కుకుపోయి గల్లంతయ్యారు. ఈ మంటల ధాటికి అక్కడ ఉన్న దాదాపు 10 నుండి 15 దుకాణాలు, ముఖ్యంగా చెక్కతో నిర్మించిన భవనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఎస్‌డిఆర్‌ఎఫ్ (SDRF), హోమ్ గార్డ్స్, అగ్నిమాపక సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. స్థానికంగా ఫైర్ ఇంజన్ సౌకర్యం లేకపోవడంతో సిమ్లా, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నుండి ఫైర్ టెండర్లను రప్పించి మంటలను అదుపు చేశారు. గల్లంతైన వారిలో రెండు జంటలు ఉన్నాయని, భవనాలు కుప్పకూలడం, మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారు బ్రతికి ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని స్థానిక ఫైర్ ఆఫీసర్ ఆర్.కె. శర్మ తెలిపారు. గ్యాస్ సిలిండర్ పేలుడు (Gas cylinder explosion) వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని బాధితుల బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.






