Encounter: కిష్త్వార్‌లో కొనసాగుతున్న భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

by Malleboina Mahesh |   (  Updated:2026-02-22 10:54:08  IST  )

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో భద్రతా బలగాల వేట! ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతం. భారీగా ఆయుధాలు స్వాధీనం."

Encounter: కిష్త్వార్‌లో కొనసాగుతున్న భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో 'ఆపరేషన్ త్రాషి-I' ('Operation Thrashi-I') కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో పాసెర్‌కుట్ (Passerkut) సమీపంలోని మంచుతో నిండిన అటవీ ప్రాంతంలో బలగాలు గాలింపు చేపట్టాయి. ఛత్రూ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు.. ఉగ్రవాదులు ఎదురు పడ్డారు. బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపడం ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. 'ఆపరేషన్ త్రాషి-I' (Operation Trashi-I) పేరుతో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్‌పిఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి.

ఇదిలా ఉంటే నేటి ఎన్ కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాదులు నిషేధిత జైషే మహమ్మద్ (JeM) సంస్థకు చెందిన వారిగా ప్రాథమిక సమాచారం అందుతోంది. వీరిలో ఒకరిని మోస్ట్ వాంటెడ్ కమాండర్ సైఫుల్లా (Saifullah) గా గుర్తించినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలం నుంచి రెండు AK-47 రైఫిళ్లను, భారీగా మందుగుండు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్ సహాయంతో అడవిని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి.

మావోయిస్టు టాప్ కమాండర్ దేవ్‌జీ లొంగిపోయారు.. ధృవీకరించిన ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం

Next Story