- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Massage: పాదాల్లోని ఈ ప్రాంతంలో మసాజ్ చేయండి.. ఈ నొప్పులకు చెక్
మసాజ్ (Massage) వల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: మసాజ్ (Massage) వల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. మసాజ్ వల్ల రక్త ప్రసరణ(blood circulation) సాఫీగా జరుగుతుంది. కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా(Oxygen supply to tissues)ను పెంచడం ద్వారా ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మసాజ్ కండరాల ఒత్తిడి(Muscle tension)ని తగ్గించడంలో మేలు చేస్తుంది. మొత్తం శరీర పనితీరును మెరుగుపరుస్తుంది.
అయితే కొంతమందిలో తరచూ మెడనొప్పి(Neck pain), పొట్ట నొప్పి(Stomach ache) వస్తుంటుంది. కాగా పాదాల మధ్యలో మసాజ్ చేయడం వల్ల స్టమక్ పెయిన్ (Stomach pain) అండ్ పొట్ట నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాదాల మధ్య ప్రాంతం వెన్నెముక(spine)తో అనుసంధానించి ఉంటుందట. కాగా ఈ ప్లేస్‌ను బొటనవేలు, ఇతర చేతివేళ్ల హెల్ప్‌తో నొక్కితే రిలీఫ్ గా ఉంటుందని సూచిస్తున్నారు. మీరు విపరీతంగా మెడ నొప్పితో బాధపడితే కనుక.. పాదాల బొటనవేలు, దాని పక్కనున్న వేలును కలిపి నొక్కండి. దీంతో మెడనొప్పికి చెక్ పెట్టొచ్చు.
పాదాల బొటనవేలు(Big toe) నుంచి అంచు వరకు నొక్కి మసాజ్ చేయడం వల్ల మొత్తం బాడీ పెయిన్స్ నుంచి రిలీఫ్ పొందవచ్చు. అయితే మన బాడీలో ముప్పై ఆక్యుప్రెషర్ పాయింట్లు (Acupressure points) ఉంటాయి. ఇవి జీర్ణక్రియ నుంచి స్టమక్ పెయిన్ వరకు ఎన్నో రకాల పెయిన్స్‌ను తగ్గించడంలో మేలు చేస్తాయి. ఆక్యుప్రెషర్ అనేది కొన్ని నరాలను ఉత్తేజపరుస్తుంది. ఆక్యుప్రెషర్ మసాజ్ వల్ల హార్మోన్ల లెవల్స్ తగ్గుతాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. తద్వారా మానసిక పరిస్థితి మెరుగుపర్చడమే కాకుండా.. బ్లడ్ సర్కులేషన్ కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.






